సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బిహార్ రాజకీయాల్లో ఏకబిగిగా అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షాలతో విచిత్ర పొత్తులు పెట్టుకొని . దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో, భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన బలమైన నేత, 57 ఏళ్ల, సమ్రాట్ చౌదరి (Cm Samrat chowdari) నేడు, బుధవారం బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) ఘనవిజయం సాధించిన తర్వాత, నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేంద్ర బీజేపీ అధిష్టానం సూచనలతో రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బిహార్‌కు తొలిసారి బీజేపీ నుంచి ముఖ్యమంత్రిఅధికారంలోకి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *