సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడకు చెందిన వంశీ అనే యువ కానిస్టేబుల్‌ రాజమహేంద్రవరం రోడ్‌ కం రైలు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణిక ఆవేశంలో నిండు జీవితాన్ని అర్పించాడు. అతని మృతదేహం నేటి శనివారం ఉదయం లభ్యమయ్యింది. వివరాలలోకి వెళ్ళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌. వంశీకి పెళ్లి సంబంధం కుదరడంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. కానిస్టేబుల్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. వంశీపై ఓ మహిళా కానిస్టేబుల్ తనను మోసం చేసాడని రాజమహేంద్రవరం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..ఫై అధికారులు ఆయన్ను పలుసార్లు పిలిచి విచారణ కూడా చేశారు.గత గురువారంకూడా పోలీసులు వంశీని పిలిచి మహిళా కానిస్టేబుల్ విషయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వంశీ అర్ధరాత్రి దాటిన తర్వాత బయటకు వెళ్లారు.. గోదావరి బ్రీజ్ మీద నుండి తండ్రికి ఫోన్ చేసి క్షమించమని అడిగి.. తాన ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని చెప్పి రాజమహేంద్రవరం రోడ్‌ కం రైలు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో దూకేశారు. వంశీ బైక్, చెప్పుల్ని గుర్తించి దూకేసినట్లు గుర్తించారు. వంశీపై పిర్యదు చేసిన మహిళా కానిస్టేబుల్ నే పెళ్లి చేసుకోవాలని లేని పక్షం లో ఉద్యోగం పోతుందని ఫై అధికారులు తన కొడుకుని హెచ్చరించినట్లు? మృతుడి తండ్రి వెంకట్రావు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *