సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తణుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు కు చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సిట్అధికారులు నేడు,శనివారం సోదాలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే, ఏప్రిల్ 23న విజయవాడలో సిట్ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి నోటీసులు కూడా అంటించారు. అయితే తన భార్యకు అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు కారుమూరి లేఖ రాశారు.. మరో వారం రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే నేటి శనివారం రోజున హైదరాబాద్‌లో (ఏప్రిల్ 25) మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాసంలో సిట్ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించారు. అనంతరం కారుమూరిని ఓ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు నాలుగు గంటలపాటు విచారించి.. ఆయన స్టేట్‌మెంట్ నమోదు చేశారు.అయన విచారణకు సహకరించారని.. అవసరమైతే కారుమూరి నాగేశ్వరరావును మరోసారి విచారిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *