సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: స్వాతంత్ర్య సమరయోధులు, విద్యాప్రదాత దంతులూరి నారాయణరాజు ఒక గొప్ప సంకల్ప జీవి, కృషీవలుడని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కొనియాడారు. నేడు,శనివారం భీమవరం జె.పి. రోడ్డులోని కాటన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన నారాయణరాజు గారి విగ్రహాన్ని .రాజ్యసభ సభ్యులు, పాక సత్యనారాయణ, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వక్తలు మాట్లాడుతూ..ఒక మహానుభావుని విగ్రహాన్ని నెలకొల్పడం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమనే ఆకాంక్షతో 1945లోనే కళాశాలను ఏర్పాటు చేసి, విద్యను సామాన్యుడి ముంగిట తెచ్చిన విద్యాదాత నారాయణరాజు అని ప్రస్తుతించారు.రాఈ కార్యక్రమంలో దంతులూరి కోటిరాజు, దంతులూరి గోపి, డిఎన్నార్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు,కార్యదర్శి గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, డిఎన్నార్ కళాశాల పాలకవర్గ సభ్యులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, నారాయణ రాజు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
