సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నేటి శనివారం ఉదయం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలోనూ కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.ఆయన హయాంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఏర్పాటు అయ్యి హిందూ పురాణాలకు సంబందించిన భారీ స్థాయిలో టెలీ సీరియల్స్ ప్రసారాలు చేసి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎల్లుండి (ఆగష్టు 7)తో ప్రస్తుత పాలకమండలి పదవి కాలం ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అనంతరం నూతన టీటీడీ చైర్మన్‌గా కరుణాకర రెడ్డి పదవి భాగ్యం పొందుతారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *