సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు -2026 ప్రదానోత్సవంలో ముఖ్య అతిధిగా హాజరు అయిన ఏపీ శాసన సభ ఉపసభాపతి రఘురామా కృష్ణంరాజు ను హీరో సుమన్ మరియు పద్మశ్రీ మురళి మోహన్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలువురు సినీ, సామాజిక రంగ ప్రముఖులకు ‘కోడి రామకృష్ణ పురస్కారాలు’ అందజేస్తూ వస్తున్నారని, దీనిలో భాగంగా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి, డిఎన్నార్ కళాశాల కోశాధికారి, మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ గా ఎన్నో సేవాలందిస్తున్న కొత్త శ్రీనివాస్ ఈ సేవా రత్న అవార్డును అందుకున్నారు. ఫౌండర్ చైర్మన్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, అవార్డ్స్ కమిటీ చైర్మన్ వీర శంకర్ , , సుమన్,దివ్యవాణి, బాబుమోహన్, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ పలువురు సినీ ప్రముఖులు మరియు భీమవరం ప్రముఖులు, బొండా రాంబాబు, వొలేటి శ్రీనివాస్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, కురిశెట్టి కాశి, తదితరులు పాలుగొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *