సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థుల ఉద్యమంతో ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర చేత రాజీనామా చేయించి, నీట్ పరీక్షా పత్రాల లీక్ తో మరల పరీక్షలు పెట్టడంతో ఆత్మహత్యలకు పాల్బడి న సుమారు 25 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు చప్పున నష్టపరిహారానికి కూడా కేంద్రాన్ని ఒప్పించిన కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, జంతర్‌మంతర్‌ ఉద్యమ నేత అభిజిత్‌ దీప్కే తాజాగా మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్రమేనని, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉందని దేశంలో ‘బడా వ్యాపారంగా’ మారిపోయిన విద్యావ్యవస్థలో పారదర్శకత ను తెచ్చి , స్థోమతతో నిమిత్తం లేకుండా అందరికీ అందుబాటులో చదువు, బలమైన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.‘‘రాత్రి (ఆదివారం) నా గదిలో ప్రశాంతంగా నిద్రపోయాను. రేపు ఏమవుతుందో, సాయంత్రం వరకు ఎలా గడుస్తుందోననే ఆందోళన తొలగిపోయింది.’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా . దేశంలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు పలువురు యువకులు ధ్వజమెత్తారు. ఇకపై అన్యాయం, అరాచకం జరిగిన ప్రతిచోటా సీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని వారు చెప్పారు. గత ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌ మల్లంగి, రుచిత్‌ ఆశా కమల్‌, అశోక్‌, పవన్‌ (హెచ్‌సీయూ), ప్రసాద్‌ (ఓయూ), యశ్‌ (కాకతీయ యూనివర్సిటీ) తదితరులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *