సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారికంగా గుర్తించిన ఆరు బీచ్ లను కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్లాన్‌లో చేర్చడానికి ప్రతిపాదించారు. ఇవి కోస్టల్ రెగ్యులర్ జోన్(సీఆర్‌జెడ్) ప్రాంతంలో ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని, పక్కాగా గుర్తించి పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అధికారులకు సూచించారు. కలెక్టరెట్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పర్యాటక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఆరు బీచ్‌లను గుర్తించారని జేసీ చెప్పారు. వాటిలో వేములదీవి, పెదమైనవానిలంక బీచ్, కేపీ పాలెం, పేరుపాలెం, పేరుపాలెం పంచాయతీలోని కనకదుర్గ బీచ్, మోళ్ళపర్రు బీచ్‌లు ఉన్నాయని ప్రకటించారు.
