సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాయలసీమ ప్రాంతంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పనితీరును పరిశీలించడానికి వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పనిలో పనిగా ఆయా ప్రాంతాలలో రోడ్లపై బహిరంగ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక వైసీపీ క్యాడర్ నుండి ప్రతిఘటనలు,నిరసనలు ఎదుర్కొంటున్నారు, ఈ నేపథ్యంలో ఆయన తన జెడ్ ప్లస్ కేటగిరి తోపాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటూ ప్రత్యక క్యాడర్ ను వెంట తీసుకోని వెళుతున్నాడనే వార్తలు వస్తున్నాయి, అయితే గత శుక్రవారం పుంగనూరు లో ఆయన పర్యటన తీవ్ర ఉద్రిక్తలు కు దారితీసింది. అటు టీడీపీ, వైసిపి కార్యకర్తలు తో పాటు సుమారు 40మంది పోలీసులు, అధికారులు తీవ్రముగా గాయాలు పాలు అయ్యి ఆసుపత్రుల పాలు కావడం దురదృష్టకరం. పలు పోలీస్ వాహనాలను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చెయ్యడం గమనార్హం. నేడు, శనివారం కూడా ఉద్రికత్త కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా వైసిపి నేతలు బంద్ పాటిస్తున్నారు, ఈ ఘటనలలో ఎక్కువ గాయపడిన గాయపడిన పోలీస్ అధికారులు చెప్పిన వివరాలలో వెళ్ళితే.. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న రోడ్డు మ్యాప్ లో ఆకస్మికంగా మార్పులు చేసి పుంగనూరు బైపాస్ మీదుగా పలమనేరు వెళ్లకుండా పోలీస్ అనుమతి లేకుండా పుంగనూరు ప్రధాన సెంటర్ లోకి ప్రవేశించి బహిరంగ సభ మొదలుపెట్టారని ..పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో టీడీపీ పార్టీలోని వారు రాళ్ళూ, బీర్ బాటిల్స్ తో తమపై దాడికి వాహనాల దహనానికి తెగబడ్డారని వారు వాపోయారు, రాష్ట్ర పోలీస్ సంఘం కూడా పోలీస్ లపై దాడి ఖండించింది. కావాలనే ప్యూహాత్మకంగా జరిగిన దాడిలో.. నిందితులను వదిలి పెట్టె ప్రసక్తి లేదని తీర్మానించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *