సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నం లో ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కే ఏ పాల్ నేడు, శనివారం‘ పప్పు లోకేశ్కే మన ఓటు’ అంటూ ఫ్లెక్సీ పెట్టి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పుంగనూరులో టీడీపీ దద్దమ్మలు చంద్రబాబు మాటలు విని విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చెయ్యడం చాల హేయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశావతారంలాగా పవన్ కల్యాణ్ పది పార్టీలు మార్చారు. నారా లోకేశ్ ని సీఎం చేయడమే పవన్ లక్ష్యమని .. ఎందుకు వచ్చిన వారాహి యాత్ర.. పవన్ కల్యాణ్ విశాఖలో నారాహి యాత్రను ఉప సంహరించుకోవాలి. పవన్ చూసి ప్రధాని మోదీ మొహంచాటేశారు. పవన్ చేసేది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ విరుచుకుపడ్డారు. విభజన హామీల కోసం పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. జనసేన పార్టీని పవన్.. ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. ప్రజాశాంతి పార్టీ తరఫున సీఎం అభ్య ర్థిగా పవన్ ప్రకటిస్తాను. పవన్ వారాహి యాత్రకు వెళ్లే రూ.500 ఇస్తున్నారు. చం ద్రబాబు యాత్రకు వెళ్లే రూ.1000 ఇస్తున్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.అని విమర్శించారు. ఇక, కేఏ పాల్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాల్ ఆఫీసు ముందు ధర్నా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *