సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పార్లమెంట్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై నేడు, శుక్రవారం చర్చలో జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశిత బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ డీలిమిటేషన్‌తో జనాభా తక్కువ ఉన్నపటికీ విసరణ రీత్యా భారీగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ( దక్షిణాది ప్రజలు దేశ ప్రయోజనాల కోసం కుటుంబ నియంతరణ పాటించిన నేపథ్యంలో .. ఉత్తరాది ప్రజలు పాటించరు ) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా లోక్ సభకు తక్కువ మంది ఎంపీలు ఉండటంతో చట్టాలు రూపొందించడం లో ఉత్తరాది ఎంపీల బలం పెరిగి దక్షిణాది వారు తమ ప్రాంత అభివృద్ధి నిధుల సేకరణ హక్కులు తదితర అంశాలలో కూడా నష్టపోతాయని శశిథరూర్ తెలిపారు. మరోవైపు లోక్ సభలో ఈ మూడు బిల్లుల ఓటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ చేపట్టనున్నారు. ఇండియా కూటమికి భేటీకి ఆర్జేడీ హాజరుకావడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *