సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంద్ర అనకాపల్లి జిల్లా ఎలమంచిలి లో స్వల్ప భూకంపం సంభవించింది. గత అర్ధరాత్రి సమయంలో 12:30 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎలమంచిలి పట్టణంతో పాటు, మండలంలోని పలు గ్రామాలలో అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది.దీనితో ఉల్లిక్కి పడిన జనం నిద్ర మని జాగారాలు చేసారు. ఈ ఘటనను నిర్ధారిస్తూ భూకంప తీవ్రత రెక్టార్స్ స్కేల్‌పై 3.7గా నమోదు అయ్యింది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు అధికారులు నేడు, శుక్రవారం ఉదయం నిర్ధారించారు. భూకంపం తీవ్రత తక్కువ కావడంతో ఆస్తి నష్టాలపై సమాచారం లేదు.
