సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందాన.. ఒక ప్రక్క యుద్దానికి విరామం ప్రకటించి చర్చలు జరుపుతున్నప్పటికీ ఇటీవల ఇరాన్ లోని కొన్ని ప్రాంతాలలో అమెరికా దాడులకు దిగటం దానికి సైలెంట్ గా గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక క్వాటర్స్ ఫై ఇరాన్ మిసైల్ డ్రోన్ దాడులు చేసుకోవడం జరుగుతూనే ఉంది. అయితే తాజగా నేడు, శుక్రవారం తెల్లవారు జామున అమెరికాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతం గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని భద్రతా దళాలు కూల్చేశాయని ఇరాన్ మీడియా తస్నీమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. జామ్ కౌంటీ గవర్నర్ మసూద్ టాంగెస్థానీని ఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురించింది. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని కూడా వెల్లడించింది.అమెరికా మాత్రం ఈ కథనాన్ని తోసిపుచ్చింది. ఆ ప్రాంతంలో తాము ఏ విమానాన్నీ నష్టపోలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. మొత్తానికి ఇరాన్ అమెరికా ఎవరి క్షిపణి వారు వెనుక పెట్టుకొని తిరుగుతున్నారు.. ఏక్షణం అయినా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *