సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఈ వేసవి సీజన్ లో నిన్న గురువారం రాత్రి మరోసారి ఉరుములు మెరుపులు పెనుగాలులతో 2గంటల పాటు వర్షం కురిసింది. ఈ వారంలో ఇది 2వ వర్షం.. దీనితో రాత్రి 9న్నర గంటల నుండి నేటి శుక్రవారం తెల్లవారు జాము 3 గంటల వరకు విద్యుత్తూ సరఫరా నిలిపివేశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు జాగారాలు చేసారు. 2 రోజులు క్రితం కూడా ఇదే తీరున రాత్రి 10 గంటలకు మొదలుకొని తెల్లవారు జాము 2గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయడం తో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడటం జరిగింది. ఇప్పటికే ప్రచండ ఎండలకు తోడు అప్రకటిత విద్యుత్తూ కోతలతో సతమతమౌతున్న ప్రజలు ఇక ఇంతకాలానికి భీమవరంలో వర్షం పడితే చాలు భయపడే పరిస్థితి వచ్చేసింది. కరెంట్ ఆఫీస్ కు( D1.D2, D3) ఫోన్ చేసిన సమాధానం చెప్పే వారు ఉండటం లేదు.. ఫోన్ బిజీగా ఉంది అని సమాధానం తప్ప .. దీనిపై విద్యుత్తూ శాఖ అధికారులు కూడా రాత్రి వేళకూడా ఫోన్ ద్వారా.. ఏ కారణం వల్ల ఎంత సమయానికి కరెంట్ పునరుద్ధరిస్తారో చెప్పితే ప్రజలకు జవాబుదారి గా ఉండాలి..అప్పడు ప్రజలులో కాస్త అసహనం తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *