సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మండువేసవిలో వర్షాలు పడతాయంటే అందరికి ఆనందమే.. అయితే అదేం విచిత్రమో? ఎన్ని ద్రోణీలు ఏర్పడిన, భీమవరం చుట్టుప్రక్కల కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా వాసులకు వర్షలు పడుతున్నాయి. కానీ భీమవరంలో కాస్త చల్లగాలులతో సరిపెట్టేస్తున్నాయి. ఇక్కడ ప్రజలకు ఎండకు బోనస్ గా ఉడుకు తప్ప ఆహ్లదపరిచే వర్షం కరువు అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం నేడు, గురువారం ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఇది రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలుస్తుంది.
