సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగులో కూడా కాస్త క్రెజ్ ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య ఆర్ధికంగా చాల కష్ట నష్టాలలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.. సింగం 2 తరువాత ఆయనకు హిట్ పడి సుమారు 7 ఏళ్ళు పైనే అవుతుంది. ఆయనకు ‘విక్రమ్’ సినిమా చివరలో ‘అలెక్స్’ అతిధి పాత్రలో వచ్చిన క్రజ్ మినహా ఇటీవల అన్ని నిరుత్సహలే.. వాళ్ళ స్వంత బ్యానర్ లో నిర్మించిన కంగాలన్ సినిమా 100 కోట్ల పైగా నష్టాలు చవిచూసింది, తరువాత మెట్రో ప్లాప్.. ఈసారి సూర్య స్వయంగా నిమించిన, కచ్చితంగా హిట్ వస్తుందని భావిస్తున్న ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు). నేడు గురువారం విడుదల కావలసి ఉంది.కానీ, డిస్ట్రిబ్యూటర్స్ తో ఆర్థిక వివాదాలు రావడంతో ఈ సినిమాకు కూడా కష్టాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో ఇప్పటికే విడుదల కావాల్సిన విడుదల కాలేదు. నేడు కూడా అన్ని చోట్ల షోలు రద్దయ్యాయి. అన్నీ సెట్ అయితే.. నేటి రాత్రి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్.. ఒకవేళ రిలీజ్ కాకపోతే పెద్ద నష్టమే…
