సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 ఏళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ ల కార్యాలయాలు ఏపీలోని కాస్మో నగరం వైజాగ్ లో శరవేగంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తాజగా నేడు, ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. నేడు, మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. వన్ గిగా వాట్ సామర్థ్యంతో సుమారు1 లక్ష కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్‌కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ.. ఈ ఏఐ యుగంలో. గూగుల్ ఇండియా ఏఐ హబ్‌కు ఇవాళ చేసిన శంకుస్థాపన విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్ భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైనదని ప్రకటించారు.దీనితో ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వేగా ఉన్న ముంబై, చెన్నైలతో పాటు విశాఖ కూడా కీలకంగా మారిందని తెలిపారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రాలు ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనిత,ఎమ్మెల్యేలు ఎంపీలు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
