సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత బుధవారం భారీ లాభాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు గురువారం ఉదయం కూడా లాభాలతోనే మొదలయ్యాయి. అయితే రియాల్టీ రంగం సూచీలను వెనక్కి లాగింది.. ఈ నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. చివరికి స్వల్ప నష్టాల ముగింపు జరిగింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.79గా ఉంది. గత సెషన్ ముగింపు (77,958)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 350 పాయింట్ల లాభంతో 78,339 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ఆరంభ లాభాలను కోల్పోయింది. నేటి సాయంత్రం స్వలా నష్టాలతో ముగించింది. 114 పాయింట్స్ నష్టపోయి 77,844 వద్ద ముగించింది. ఇక మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగింది. స్వల్ప నష్టాలతో 24,326వద్ద ముగిసింది.. (stock market ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *