సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి కేరళం రాష్ట్రంలో గెలవడం అభినందనీయమని ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారామ్ తెలిపారు. ఎన్నికల ఫలితాలను పురస్కరించుకొని భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు మంగళవారం కేకు కోసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తో పాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందించిందన్నారు. అదేవిధంగా కేరళం రాష్ట్రంలో కూడా ఆ పరిపాలన ప్రజలకు అందించి వారి మనసులను దోచుకుంటామన్నారు. రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా నాయకురాలు, సోడాదాసి సిలివియా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్, బోనం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *