సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి అని, ఆరోగ్యపరంగా అండగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు మంగళవారం 65 మంది లబ్ధిదారులకు రూ 70,40,483 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు భీమవరం నియోజకవర్గంలో 758 లబ్ధిదారులకు రూ 6 కోట్ల 10 లక్షల 2 వేల 999 లను అందించామని, అర్హత ఆధారంగా ప్రతిఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామన్నారు. అర్హులైన పేదలకు సకాలంలో సాయం అందుతోందన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
