సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సెషన్‌లో సెన్సెక్స్ 81,592.45 వద్ద, నిఫ్టీ 25,144.30 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. నేడు, సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. గత సెషన్‌లో శుక్రవారం నష్టపోయిన సూచీలు తిరిగి పుంజుకుని సెన్సెక్స్ (BSE Sensex): 512.34 పాయింట్లు (0.63%) లాభపడి 82,104.79 వద్ద స్థిరపడింది. ఇక అదే బాటలో నిఫ్టీ (NSE Nifty): 146.80 పాయింట్లు (0.58%) పెరిగి 25,291.10 వద్ద ముగిసింది. హోర్ముజ్ జలసంధి గుండా రవాణా సాధారణ స్థితికి చేరుకోవడంతో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 0.88 శాతం తగ్గి మరల బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరింది.రూపాయి బలపడటం:తో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 94.13 వద్ద ముగిసింది.
