సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; నేడు, ఆదివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన మానవత్వాన్ని చూపించారు. తణుకు మండలం వేల్పూరు మినీ బైపాస్ రోడ్డులో ట్రాక్టర్ ఢీకొని మోటార్ సైకిల్ పై వెళుతున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భార్య పులగం భవాని (32) ఘటనా స్థలంలోని మృతిచెందగా ( ఫై చిత్రంలో విషాద ఘటన తీవ్రత చూడవచ్చు)భర్త బాలాజీకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పందించి హుటాహుటిన అంబులెన్స్ వాహనాన్ని రప్పించి క్షతగాత్రులను తణుకు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోనే మృతి చెందిన భవాని మృతదేహాన్ని తక్షణమే అక్కడ నుంచి పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి సహకరించారు. క్షతగాత్రులకు తక్షణం వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫోన్ లో వైద్యాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *