సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ఇరాన్ ఫై ఇక ఏకపక్ష యుద్ధం ఆపవలసిందే అని చైనా రష్యా ల హెచ్చరికలు నేపథ్యంలో .. అమెరికా తో ఇరాన్ రెండో దఫా చర్చలు కు అంగీకరించిన నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలుకూడా దిగి వచ్చాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త బలపడింది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం రోజంతా లాభాల్లోనే ఉన్నాయి. గత సెషన్ ముగింపు (76,847)తో పోల్చుకుంటే నేడు బుధవారం చివరకు సెన్సెక్స్ 1263 పాయింట్ల లాభంతో 78,111 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ చివరకు 388 పాయింట్ల లాభంతో 24,231 వద్ద స్థిరపడింది (stock market ).బ్యాంక్ నిఫ్టీ 696 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1264 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.38గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *