సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో పలు ఉద్రిక్తలకు దారి తీసిన పురాతన రామాలయం పునర్ నిర్మాణంకు తెలుగు రాష్ట్రాల లోని శ్రీ రామ భక్తుల నుండి విశేష స్వాందన వచ్చింది. నేడు, బుధవారం భీమవరం శివారు పెదమిరం లోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండీ ఎమ్మెల్యే రఘురామ కృషంరాజు తన కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. రామాలయం నిర్మాణానికి కోటి రూపాయలు సమకూరాయని, నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఆకివీడులో దీనావస్థలో పురాతన రామాలయం ఉందని ముందుగా తనకు సాక్షి మీడియా ద్వారానే తెలిసిందని.. రాముడి కోసం వెళ్తే తనపై దాడి చేయించారని, రామాలయ నిర్మాణానికి కూడా పలువురు కోర్ట్ లలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మసీదు, చర్చి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని.. నాకు క్రిస్టియానిటీ అంటే గౌరవం ఉందని, అయితే కొందరు క్రైస్తవ పెద్దలు బలవంతంగా హిందువులను తమ మతంలోకి మార్చేస్తున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధం అని, అనుమతి లేని ‘చర్చిల’పైనా చర్యలు ఉండాలని తానూ చెబుతున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. దేవాలయం నిర్మాణానికి అనుమతి కావాలని,అయితే, తనపై కోర్ట్ లో పిటిషన్లు వేసిన వారు నిర్వహిస్తున్న చర్చిలకూ ఎటువంటి అనుమతి లేదని ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. కల్వరి సతీశ్ ప్రార్థనా మందిరానికి అనుమతి ఉండాలి కదా? అని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో వారు మీటింగ్ హాలు కడతామని అనుమతి తీసుకుని ఆ తర్వాత చర్చిగా మార్చుకుని ప్రార్థనలు చేస్తున్నట్లు రఘురామ ఆరోపించారు,. నంబూరు వద్ద ఉన్న కల్వరి టెంపుల్.. ఇలా చాలా చోట్ల ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై విచారణ చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు.
