సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం చివరి శుక్రవారం సెషన్లో లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ వారం సోమవారం మాత్రం నష్టాలలో ప్రారంభమయ్యాయి. ఇరాన్ అమెరికా యుద్ధంతో పాటు హర్ముజ్ మూసుకొనిపోవడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 90 డాలర్ల మార్కుకు చేరడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. భారత్ లో దేశీయంగా హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో కనిపించిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నేడు సోమవారం భారత ప్రధాన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 442.93 పాయింట్లు (0.57శాతం) నష్టపోయి 77,708.52 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 95.80 పాయింట్లు (0.39శాతం) నష్టపోయి 24,238.50 వద్ద ముగిసింది.
