సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రజల భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఇతరత్రా ఆస్తుల ‘రిజిస్టేషన్ కార్యాలయ ప్రక్రియ లో ప్రెవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణ రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి సోమవారం నుండి లేఖరులు తమ సేవలను నిలిపివేస్తూ పెన్ డౌన్ కార్యక్రమం ప్రారంభించడంతో భీమవరం పట్టణం తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద తమ ఆస్తులు రెజిస్టషన్ చేయించుకోవడానికి వచ్చిన పలువురికి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా లేఖరులు, స్టాంప్ లాండర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ కల్పి సుమారు 2500 మంది పైగా రిజిస్టర్ ఆఫీసులపై జీవిస్తున్నారని వారి జీవనోపాధి కష్టాలలో పడుతుందని,ఇప్పుడు వాటినిరాష్ట్ర ప్రభుత్వం ప్రెవేటు పరం చేస్తే ప్రజలకు పారదర్శకత లోపించడం జరుగుతుందన్నారు. తమ జీవితాలకు ఆదాయాలకు ప్రభుత్వ భరోసా కలిపించాలని లేఖరులు డిమాండ్ చేస్తున్నారు.
