సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆక్వా రాజధాని పశ్చిమ గోదావరి జిల్లాలో అసలే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి నష్టాల బారిన పడుతున్న ఆక్వా రైతులకు మొన్నటి వరకు ఎండలు చెరువులను వేడి నీటి కొలనులుగా మార్చి ఇబ్బంది పెడితే వర్షాకాలం చివరి అనకముగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒక్కసారిగా 3 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలకు చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయిలపై ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల చెరువుల్లో నీరు చల్లబడటంతో ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు మృత్యువాత పడుతుండటంతో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచేందుకు నిరంతరాయంగా ఏరియేటర్లు తిప్పుతున్నారు. మరో ప్రక్క వర్షాల దెబ్బకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండటంతో అద్దె జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. డీజిల్‌ ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని సరిగ్గా కౌంట్‌కు వస్తున్న రొయ్యల చెరువులల్లో రొయ్యలు మేతలు తినడం పూర్తిగా తగ్గిపోవడంతో, పీహెచ్‌లు పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. గుడ్డి లో మెల్లలా నేడు, శుక్రవారం వాతావరం తెరిపి ఇచ్చింది, ఎండ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *