సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సంచలన చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తాజగా మాట్లాడుతూ.. కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సీక్వెల్ గొప్ప భావోద్వేగాలతో, అత్యంత భారీ బడ్జెట్ స్థాయిలో షూటింగ్ సాగుతుందని తెలిపారు.‘‘కల్కి’ సినిమాకు యూనిట్ అంతా ప్రాణం పెట్టి పని చేసింది. కల్కి వరల్డ్ రపకల్పనకు అహర్నిశలు శ్రమించాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో మా చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు రావడంతో, మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించినట్టయింది. సీక్వెల్లోనూ అదే వరల్డ్ కంటిన్యూ అవుతుంది. అందులో ఉన్న పాత్రలన్నీ ఇందులోనూ ఉంటాయి.సెల్యులాయిడ్ మీద ఇటీవల పౌరాణిక రామాయణ మహాభారత అంశాల ప్రస్తావన పెరుగుతుండటాన్ని గురించి నాగ్ అశ్విన్ హర్షం వ్యక్తం చేసారు, హీరో ప్రభాస్ గురించి చెబుతూ ‘ప్రభాస్ లాంటి నటుడు దొరకడం మా అదృష్టం. దర్శకుడి విజన్‌ని నమ్మే స్టార్ ఆయన’ అని అన్నారు. కల్కి చిత్రానికి జాతీయ పురస్కారాలు అందుకోవడం గర్వంగా ఉందని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు
