సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దురంధర్’ సిరీస్ సినిమాలు భారత దేశంలో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడం మనం చూశాం. కానీ, శత్రుదేశం పాకిస్తాన్ లోని సర్వర్లను సైతం క్రష్ చేయడం ఎప్పుడైనా విన్నారా? సరిగ్గా ఇదే నిజమైంది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ (Dhurandhar )చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించినప్పటికీ.. ఓటీటీలోకి వచ్చాక నెట్‌ఫ్లిక్స్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో దూసుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ‘ధురందర్ 2 దీ వివేంజ్‌’ (Dhurandhar The Revenge) అయితే తెలుగునాట కూడా 100 కోట్ల పైగా కలెక్షన్స్ తుపాను రేపింది. తాజాగా ఈ సినిమాను జియో హాట్‌స్టార్ (Jio Hotstar)ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది ఇండియాలో కాకుండా, ఇతర దేశాల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏంటంటే.. ఈ దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉంది! ఈ సినిమాలోభారత్ ఫై పాక్ కుట్రలు, పాకిస్తాన్ నుండి స్వతంత్ర దేశం కోరుకొంటున్న ‘బెలూచిస్తాన్’ యోధులపోరాట కధ ఉన్నపటికీ. పాక్ ప్రజలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం గమనార్హం. ఇక మన ధురందర్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వాలని, పాకిస్థాన్‌లో భారీ బడ్జెట్‌తో ఇదే తరహా కదంశంతో ‘మేరీ ల్యారీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మన సినిమా క్రేజ్‌ను తగ్గించాలనే ప్లాన్‌తో వచ్చిన ఆ సినిమా.. అక్కడ అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. సొంత దేశం సినిమాను పక్కనబెట్టి, మన ధురందర్-2 కోసం అక్కడి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇక పాకిస్థాన్ సోషల్ మీడియాలో సైతం మన సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *