సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో విజయ్ రాజకీయాలలోకి రావడంపై తన అసహనాన్ని చేతలలో చూపెట్టి .. తమిళనాడు ఎన్నికలకు ముందు స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని భావించిన తమిళ సీనియర్ నటుడు,సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) చెన్నైలో నేడు, ఆదివారం చేసిన రాజకీయ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని పేర్కొన్నారు. అలాగే నటుడు విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. మీడియాలో ప్రచారం జరిగినట్లు .. నిజానికి విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. విజయ్ కాబ్బటి సరిపోయింది .అదే కమల్‌హాసన్ సీఎం అయితే అసూయ పడతానని చమత్కరించారు. విజయ్ తనకు ‘సమవుజ్జీ’ అనుకోవడం లేదని తెలిపారు. అయితే తాను కూడా గతంలో పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడినని వివాదస్వదా వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఓటమి తరువాత తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఇటీవల తాను కలిసిన భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు.. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, స్నేహపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
