సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం నుండి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రజా సమస్యలపై గట్టి చర్చ వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ..సమావేశాలకు ముందు పార్లమెంట్ భవనం వెలుపల ప్రసంగించిన మోదీ.. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయానికి కారణమైన హైదరాబాద్ కు చెందిన యువ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అదే సమయంలో ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ ప్రాజెక్టుపై పని చేసిన బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదంటూ రాహుల్ గాంధీపై పరోక్షంగా సెటైర్ వేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీది ’56 అంగుళాల ఛాతీ’ అంటూ పలువురు బీజేపీ నేతలు చెప్పారు.ఈ ఏడాది పార్లమెంట్‌లో చైనా భారత్ ను ఆక్రమిస్తుంది. అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. ’56 అంగుళాల ఛాతీ ఏమైంది?’ అంటూ ప్రధాని మోదీపై సెటైర్ వేశారు.. ఇప్పుడు మోదీ ’56 ఏళ్ల యువకుడు’ అంటూ కౌంటర్ చేయసారనిపిస్తుంది.
