సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీట్ పరీక్షా నిర్వహణలో అవినీతి జరిగిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చెయ్యాలని యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం వారిపై జరిగిన పోలీస్ లాటి ఛార్జ్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోతే, దీనిపై రాహుల్ గాంధీ నేడు, మంగళవారం లోక్ సభలో కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ చర్చకు తెర లేపారు. ఇదిలా ఉండగా ‘గాయం మీద రోకలి పోటులా కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని లక్షలాది రైతుల ఆందోళనలు తాజగా టెంక్షన్ పెడుతున్నాయి. తాజగా ఢిల్లీలో హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పంజాబ్, హర్యానా నుంచి ఏకంగా 500 పైగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ వైపుగా కిసాన్ ఘాట్ వద్ద మహాపంచాయత్‌లో నిరసన తెలిపేందుకు వేలాది మంది అన్నదాతలుత రలివస్తున్నారు. . ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్ల ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగుతున్నారు. ఆ ఒప్పదం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
