సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ లో అత్యంత దారుణమైన పాకిస్తాన్ కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాద కుట్రగా భావించే 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ (Hamza Burhan) పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో హతమైనట్లు తాజాగా నేటి గురువారం మధ్యాహ్నం సమాచారం అందింది.. దులందర్ సినిమా తరహాలో ఇటీవల పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో హతమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజగా ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన విషాద ఘట్టం ఇప్పటికి ఎవరు మరువలేరు. హమ్జా బుర్హాన్ పుల్వామా దాడి ప్రణాళికలో కీలక పాత్ర పోషించాడని భారత దర్యాప్తు సంస్థలు అనుమానించాయి.
