సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు, గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్‌ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వాహణాధికారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం సెలవును మే 28కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోవో జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *