సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనం నందు శనివారం వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి P.హనీషా విచ్చేయగా, కార్యక్రమానికి బార్ సోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ అధ్యక్షత వహించారు. వేదికపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ A.S.R.రెడ్డి, భీమవరం కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు అద్దంకి వెంకట కృష్ణారావు, వన్ టౌన్ S.I. కృష్ణాజి,లు ముందుగా ఆహార భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను, పోస్టల్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సివిల్ జడ్జి P. హనీషా మాట్లాడుతూ సమాజ అభివృద్ధి పథంలో ఉండాలంటే ప్రతి ఒక్కరు ముందు ఆరోగ్యంగా ఉండాలని, కల్తీ సరుకులు,ఆహార పదార్థాలతో అనారోగ్యం సంభవించి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, నిల్వ చేసిన ఆహారాలు, గడువు దాటిన నిత్యవసరాలు, పండ్లు, తినుబండారాల విక్రయాల ద్వారా ప్రాణాంతకమైన, దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో నాణ్యతతో కూడిన ఆహారాలు, సరుకులు కొనుగోలు, విక్రయాలు చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన చట్టాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో కిరాణా మరియు పండ్ల వ్యాపారస్తులు పాల్గొన్నారు.
