సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదం జరిగితే 100, 101, 108, 104 నెంబర్లకు తెలియజేయాలని భీంస్బస్టస్మ్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో నేడు, మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను ఆప్రమత్తం చేసేందుకు వారం రోజులపాటు ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్రమత్తతతోనే అగ్ని ప్ర మాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖాధికారులు బి శ్రీనివాసరావు, కె శ్రీనివాస రావు , చెరుకువాడ రంగసాయి, కొప్పినిడి శ్రీనివాస్, మాగాపు ప్రసాద్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, శ్రీనివాస్, శేఖర్, ట్రాఫిక్ ఎస్సై కోనేటి రావు, అగ్నిమాపక శాఖాధికారులు పాల్గొన్నారు.
