సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వతంత్ర సార్వభౌమత్వంతో భావజాలంతో.. కరోనా సమయంలో ప్రపంచ దేశాలను ఆదుకొని పాకిస్తాన్ ఫైసిందూర్ యుద్ధం వరకు ‘పులి’లా గర్జించిన భారత్ కు ఏమయ్యింది? ట్రంప్ ఆదేశాలతో?సిందూర్ ఆపరేషన్ ఆకస్మికంగా ఆపివేసాక ఎదో మార్పు స్వష్టంగా కనపడుతుంది. భారత్ దేశ విదేశాంగ విధానం ఎందుకు అమెరికా ఆంక్షలను విధానాలను గౌరవిస్తుందో ప్రజలకు తెలియదు కానీమిత్ర దేశాలను దూరం చేసుకొని, కొని తెచ్చుకొంటున్న కష్టాలతో భారత దేశ ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకి ఆందోళన కరంగా మారుతుంది. అన్నింటికి ఇరాన్ యుద్ధం కారణం అంటే సహేతుకంగా లేదు. అమెరికా డాలర్ తో పోలిస్తే మన భారతీయ రూపాయి విలువ 72 రూపాయలు నుండి ‘పరమ దారుణం’గా 100 రూపాయలకు పడిపోతున్న నేపథ్యం ఆందోళన రేకెత్తిస్తుంది. భారత్ కు మిత్ర దేశాలు రష్యా, ఇరాన్ తక్కువ ధరకు చమురు ఇచ్చే ఆఫర్స్ ఉన్న అమెరికా ఆదేశాలతో మన దేశం ఆ చమురును తగిన స్థాయిలో కొనలేని పరిస్థితులలో భారత్ ఇరుక్కొంది. భారత్ చమురు దిగుమతులు కోసం ఇరాన్ లో వేలకోట్ల నిధులతో నిర్మిస్తున్న పోర్ట్ ను కూడా భారత్ వదిలేసు కొంటుందా? ఇరాన్ తో హర్ముజ్ జల సంధి దగ్గర మన నౌకలకు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో 145 కోట్ల పైగా జనాభా ఉన్న భారతదేశ ప్రజలు అవసరాల కోసం దిగుమతులపై కేంద్రం ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు సంక్షోభం బయట పడకుండా మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇప్పుడు ప్రజలను పొదుపు, త్యాగాలు చెయ్యాలని ఇంధనంతో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించు కోవాలని, బంగారం కొనుగోళ్లు ఆపేయాలని సాక్షత్తు ‘ప్రధాని మోదీ’ పిలుపు నివ్వడం.. పెరగబోతున్న ‘భారీ ధరలు’ కు ప్రజలను సిద్ధం చెయ్యడమే.. ఇక పెట్రోలు ఫై ఆంక్షలు వస్తే ఎన్ని పరిశ్రమలు దెబ్బ తింటాయో? ఎందరు ఉద్యోగులు ఉపాధి కోల్పోతారో? ఎన్ని కోట్ల కుటుంబాలు ఇబ్బంది పడతాయో ?రవాణా చార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటిపోతాయో? పాలకులకు తెలియంది కాదు. పాలకులు తమ కారుల కాన్వాయిలను తగ్గించుకొంటే తీరిపోయే సమస్య కాదు ఇది.. ముందు భారత్ విదేశాంగ విధానంలో మార్పులు రావాలి.. గతంలో ఉన్న ‘తలవంచని ‘పొగరు’ కనపడాలి.. ఏది ఏమైనా భారత్ అతి త్వరలో ఈ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కాలని కోరుకొందాం.. ‘సిగ్మా’ప్రసాద్ కాలమ్స్
