సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు మరోసారి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. AI ప్రభావం IT సంస్థలపై పడటంతో పాటు ..ఇటీవల అమెరికా సుప్రీం కోర్ట్ తీర్పుతరువాత తాజగా మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా 15% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ జారీ చేసిన ఆదేశాలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. ఇది నేరుగా భారతీయ ఎగుమతి రంగాలపై, ముఖ్యంగా ఐటీపై ప్రభావం చూపింది. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నేటి మధ్యాహ్నం 12.10 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,500 కీలక స్థాయికి దిగువన కొనసాగుతోంది.
