సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు , నరసాపురం ఎమ్మెల్యే నాయక్, టీపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. పవన్ వేదికపై మాట్లాడుతూ.. ఇటీవల తన ఆరోగ్య కారణాల రీత్యా భీమవరంలో యనమదురు కాలువ ఫై నిర్మించిన వంతెనలకు మొదలు పెట్టనున్న అప్రోచ్ రోడ్డు పనులు కు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయలేక పోయానని త్వరలో ప్రారంభిస్తానని సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళుతూ, జనసేన ఉద్యమి సభ్యత్వాల నమోదులో కీలకంగా వ్యవహరించిన జనసేన సాధక్ లకు కృతజ్ఞలు తెలిపారు.
