సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు, శనివారం జరిగిన సమావేశం లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సంక్షోభంతో భారత ప్రధాని పొదుపు చర్యలలో భాగంగా ఇచ్చిన పిలుపుకు స్పందించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మహానాడు సభ’లను రద్దుచేసి హైబ్రిడ్ విధానంలో రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలోని టిడిపి శ్రేణులను ఏకం చేస్తూ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారని భీమవరం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల కన్వీనర్లు, కో- కన్వీనర్లు తమ యూనిట్ బూత్ మరియు గ్రామ వార్డు ఇతర కమిటీ నాయకులను సమన్వయం చేస్తూ27, 28 తేదీలలో టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించే మహానాడు సభను వర్చువల్ గాపాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
