సిగ్మా తెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవాలయానికి చెందిన తాడేరు లోని 69 ఎకరాల పొలాలలో ఒక కౌలు దారుని పొలం నుండి అక్రమంగా మట్టిని మట్టి మాఫియాకు చందిన వారు ఇటీవల ట్రాక్టర్లు లో తరలించి అమ్ముకొంటున్నారని స్థానికుల నుండి సమాచారం రావడంతో దేవాలయ ఇఓ రామకృష్ణంరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ బంగార్రాజు లు స్థానిక పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో నేడు, శుక్రవారం జరిగిన ఆకస్మిక దాడిలో అక్కడ మట్టిని తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు ను సీజ్ చెయ్యడం జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ఈమట్టి మాఫియా వెనుక ఎవరు ఉన్న ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకొంటామని దేవాలయ చైర్మెన్ బంగారు రాజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *