సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణ మహోత్సవం ఆగస్టు 1, శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ అమ్మవారి మహిళా సేవకులు ఘనంగా సమర్పించడానికి దేవస్థానం వద్ద ఏర్పాట్లు జరగనున్నాయి., ఈ కార్యక్రమం శ్రీ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పూరి గుడి నుండి శోభాయాత్ర ప్రారంభమై భీమేశ్వరస్వామి గుడి, పొట్టి శ్రీరాములు జంక్షన్, తాలూకా ఆఫీస్ మీదుగా దేవస్థానానికి చేరుకుంటుందని. అనంతరం దేవస్థానం వద్ద అర్చకులు, వేద పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య సంప్రోక్షణ నిర్వహించి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి మహిళా సేవకులు సారె సమర్పిస్తారు.ఈ పవిత్ర మహోత్సవంలో భక్తులు, మహిళా సేవకులు తమ శక్తి మేరకు సారె సమర్పించి, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతులు పొందాలని దేవస్థానం అధికారులు కోరారు.( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *