సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేవి చలి వేంద్రాలేనని ఏపిఐఐసి చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ సీనియర్ నేత,మెంటే పార్ధసారధి అన్నారు. భీమవరం అడ్డ వంతెన దగ్గర ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు చలి వేంద్రాన్ని నేడు, అదివారం వారు ప్రారంభించారు. వేసవిలో ప్రధాన కూడలిలో గత ఐదేళ్లుగా పివిటి బ్రదర్స్ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పివిటి బ్రదర్స్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు,ఏఎస్ రాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు మద్దుల రాము, కలిదిండి రామచంద్రరాజు, శ్రీనివాస్ రాజు, అల్లూరి సుబ్రహ్మణ్య రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *