సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల లో సంచలనం రేపిన ఆకివీడు పెదపేటలోనీ రామాలయం పునర్ నిర్మాణ పనులు నిన్న రాత్రి నుండి ప్రారంభం అయ్యాయి. కోర్ట్ లలో పలువురు పిటీషన్ లు దాఖలు చేస్తూ తమ అభ్యన్తరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ అడ్డంకులు అన్ని తొలగించుకొంటూ రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు ఆధ్వర్యంలో.. రామ భక్తులు, దాతల సహకారంతో రామాలయ పునర్ నిర్మాణానికి మొదటి ‘ముందడుగు’ పడింది. ఉద్రికలు కు తావు లేకుండా పనులు గత శనివారం రాత్రి పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సమక్షంలో.. ఆకివీడు పెదపేటలోనీ పాత రామాలయాన్ని పొక్రిన్స్ తో కూల్చివేసి స్థలాన్ని చదును చేసే పనులు పని నేటి ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించే వేళకి శరవేగంగా పూర్తీ చేసారు. అతి త్వరలో మంచి ముహూర్తం లో సుందరమైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, శరవేగంగా నిర్మిస్తామని శ్రీ రామ ఆలయం నిర్మాణ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ( చదును చేసిన స్థలాన్ని ఫై తాజా చిత్రంలో చూడవచ్చు)
