సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఓటర్ సర్వే సమగ్రంగా జరపాలని కమిషనర్ ఎం శ్యామల దేవి అన్నారు స్థానిక భీమవరం మునిసిపల్ ఆఫీస్ నందు నేడు, శుక్రవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పట్టణంలో ఓటర్ సర్వే సమగ్రంగా జరపాలని అదేవిధముగా కొత్త ఓటు హక్కు కలిగిన వారిని నమోదు చేయుట మరియు ఒకే డోర్ నెంబర్లు పై ఎక్కువ ఓట్లు ఉంటె ఓటర్ల వివరాలు తనిఖీ చేసి ఆ రిపోర్ట్ తెలియపర్చాలని సూచనలు జారీ చేశారు ఈ విషయంలో ఎటువంటి తప్పిదం జరిగినచో సంబంధిత సచివాలయ సిబ్బంది పై చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు,. ఈ కార్యక్రమంలో కమీషనర్ తో పాటు ACP పి.గౌరు, రెవిన్యూ ఆఫీసర్ రంగారావు Blo సూపర్ వైజర్ లు తదితర అధికారులు పాల్గొన్నారు…
