సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఏపీ క్యాడర్ నుద్దేశించి ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికలలో పార్టీ క్యాడర్ కి అండగా ఉండటానికి ఇక మంగళగిరిలోనే అందరికి అందుబాటులో ఉంటాను, మన జనసేన కేంద్ర కార్యాలయం. పార్టీ భవనం నిర్మాణం అయితే పూర్తి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. దీని వెనుక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే నివాసం ఉంటాను. ఇక హైదరాబాద్ ను వదిలి ఇక్కడే ఉండవలసిన అవసరం వచ్చింది. ఏపీని ని పాలించడానికి వైఎస్ జగన్అనర్హుడు. అటువంటి వ్యక్తిని గద్దె దించాలి.దానికోసమే నా పోరాటం. జగన్ దిష్టి బొమ్మను ఊరేగిస్తే మన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. అటువంటి వారికి మన నాయకులు అండగా ఉండాలి కదా..?. బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేస్తే నేను స్పందించాను. మన జనసేన నాయకులపై దాడి జరిగితే కనీసం స్పందించరా..? ఎన్డీఏ సమావేశంలో మనకు ఇచ్చిన ప్రాధాన్యత చూశారు కదా.!. నిజాయితీగా పని చేస్తే గుర్తింపు అదే వస్తుంది. పరాజయంలో వచ్చే నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది. అయినా ఎన్నో తట్టుకుని ప్రజల కోసం నేను నిలబడ్డాను. ఒక్కసారి మాట ఇస్తే నా కంఠం తెగి పడే వరకు అలాగే ఉంటాను. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అయితే వెంటనే సీఎం అయిపో అంటే.. మన పని మనం చేసుకొంటూ పోతేనే కదా ? ప్రజలు మెచ్చి సీఎం పదవి ఇచ్చేది? ఇది పార్టీ క్యాడర్ అర్ధం చేసుకోవాలి. సీఎం జగన్, అతని అనుచరులు మానవ వనరులను దోపిడీ చేస్తున్నారు. వాటిపై అందరం కలిసి పోరాటం చేయాలి. ఆగస్టు 10వ తేదీ నుండి 3వ విడుత వారాహి యాత్ర వైజాగ్ నుండి ప్రారంభిస్తాను అని ప్రకటించారు, పవన్ కల్యాణ్.
