సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి రేపటి వెలుగు చూపిన ప్రకాశకులు సీఎం చంద్రబాబు అని, 48 ఏళ్ల పాటు ప్రజాసేవలో తరించిన ధన్యులు చంద్రబాబు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను భీమవరం శ్రీవెంకటేశ్వర బధిర పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి చిన్నారులకు బిస్కెట్స్ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో . ఏపీఐఐసి చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు వివిధ
కార్పొరేషన్ల డైరెక్టర్లు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
