సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో గత ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య హాజరు అయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు తటవర్తి నాగ బదిరీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ భీమవరం మండల అర్బన్ పరిధిలోని 3600 మంది ఆర్యవైశ్య సంఘ సభ్యులను కలుపుకుని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. , ప్రధాన కార్యదర్శి కురిశేటి సాయిరామ్ కుమార్, ట్రెజరర్ పానుగంటి చంద్రశేఖర్ గుప్తా లచే ప్రమాణ స్వీకారం చేయించారు. .ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలను సభ్యులు చిత్తశుద్ధితో నిర్వర్తించి సంఘం బలోపేతం చేయడానికి సభ్యులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్య వైశ్య పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు,
