సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మంచి ఓపెనింగ్స్ సాధించిన నాని హీరోగా సీనియర్ హీరో మోహన్ బాబు విలన్ గా థియేటర్లకు వచ్చిన ‘ది ప్యారడైజ్ (The Paradise) సినిమా రెండో వారంలోకి అడుగు పెట్టి న నేపథ్యంలో కలెక్షన్స్ నెమ్మదించాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ.186 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలంగాణలో లాభాలు సాధించిన ఏపీలోని పలు ఏరియాలలో నష్టాలు తప్పవు అని వినిపిస్తున్నది. కాగా ఈ అక్టోబర్ నెల 4వ వారంలో ఈ సినిమా ఓటిటి ప్రేక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది .అయితే సమయం సరిపోకపోవడంతో అనిరుధ్ అందించిన ఒక పవర్‌ఫుల్ ‘దేశం’ సాంగ్‌ను థియేటర్లలో నిడివి దృష్ట్యా తీసి వేయాల్సి వచ్చిందని అది కూడా పెట్టివుంటే సినిమాకు మరింత బజ్ వచ్చేదని .. అని డైరెక్టర్ శ్రీకాంత్ ఇటీవల వ్యాఖ్యానించారు, వెండితెరపై మిస్సయిన ఆ గూస్‌బంప్స్ తెప్పించే ట్రాక్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా జోడించేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
