సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న అంశంపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరిగింది. మార్చిలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఎస్సీ హోదా కోల్పోయిన పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. తీర్పు విషయంలో లోపాలు లేవని తేల్చి చెప్పింది. వివాదం వివరాలలోకి వెళ్ళితే …బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెంలో చర్చి విషయంలో వివాదం జరిగింది. 2021లో పాస్టర్ చింతాడ ఆనంద్ ఫిర్యాదుతో అక్కల రామిరెడ్డి సహా మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తాను క్రైస్తవ మతస్థుడనని చర్చిలో ప్రార్థన ముగించుకుని వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీనిపై అక్కల రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. ఈ మేరకు విచారణ చేసిన హైకోర్టు.. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరిస్తే రాజ్యాంగపరంగా ఎస్సీ హోదా ఎలా వర్తిస్తుందని ? ఇది చెల్లదనీ 2025 ఏప్రిల్ 30న ఇచ్చిన తీర్పులో తేల్చి చెప్పింది. దీనితో ఏపీ హైకోర్టు తీర్పును పాస్టర్ చింతాడ ఆనంద్ మరల సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఈ ఏడాది మార్చి 24న తీర్పు ఇచ్చింది. అయితే పాస్టర్ చింతాడ ఆనంద్ మరోసారి తీర్పు పునః సమీక్ష కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. కానీ తాజగా సుప్రీం కోర్టు ‘రిప్యూ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *